పరకాల నేటిధాత్రి
హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో శనివారం రోజున పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి చేతుల మీదుగా మహ్మద్ అలీ పరకాల పట్టణ మైనారిటిసెల్ అధ్యక్షునిగా 2వ సారి నియమితులయ్యారు.ఆర్డర్ కాపీ తీసుకున్న అనంతరం మహ్మద్ అలి మాట్లాడుతూ మైనారిటీ సెల్ అధ్యక్షునిగా నియమించినందుకు సంతోషగా ఉందన్నారు.పరకాల పట్టణ ప్రజలకు నా వంతు సేమలు అందిస్తానని అన్నారు. గాదీఖానా,ఆశీర్ ఖానా, గౌస్ పాక్ జండగద్దె స్థానిక శాసన సభ్యుల దృష్టికి తీసుకువెళ్ళి ఈ సమస్యలు పరిష్కారానికి కృషిచేస్తానని అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పెట్టిన ఆరగ్యారెంటీ పథకాలను పేద ప్రజలకు అందేవిధంగా పనిచేస్తానని నాకు ఈ పదవి రావడానికి కృషిచేసిన మైనారిసెల్ జిల్లా అధ్యక్షులు అబిష్ మీర్జా,పరకాల మండల కాంగ్రెస్ అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి,ఎంపిపి తక్కళ్లపెల్లి స్వర్ణలత,హన్మకొండజిల్లా ఎస్సి సెల్ చైర్మన్ పెరిమాండ్ల రామకృష్ణ,నడికూడా మండల అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్, పరకాల పట్టణ యూత్ అధ్యక్షులు మచ్చ సుమన్, పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంద నాగరాజు, నాగారం ఉపసర్పంచ్ కోసరి రాజు,చర్లపల్లి సర్పంచ్ చాడ తిరుపతి రెడ్డి,ఏకు రవికుమార్,బొచ్చు మోహన్,మార్క కిరణ్ గౌడ్,అజయ్,రాకేష్,చిన్ని,క్రిష్ణారెడ్డి, దాసరి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.