ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ అడిగితే కోర్టుకు వెళ్ళమన్న ఎమ్మార్వో – బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గౌడ్

రామడుగు, నేటిధాత్రి:

అవసరాలు నిమిత్తం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం గత కొద్ది రోజుల క్రితం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన పొన్నం శ్రీనివాస్ గౌడ్ రామడుగు తాహశీల్దార్ కార్యాలయాన్ని అర్జీ పెట్టుకోగా తహశీల్దార్ భాస్కర్ కుటుంబ సభ్యుల సర్టిఫికెట్ కావాలంటే కోర్టుకు వెళ్ళాలని ఉచిత సలహా ఇచ్చారని శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా గోపాలరావుపేట గ్రామంలో సోమవారం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన గోడును వెళ్ళపోశారు. కుటుంబ అవసరాల నిమిత్తం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ అర్జీ పెట్టుకుంటే తహశీల్దార్ బ్యాంకు లావాదేవీల కోసమే కుటుంబ సభ్యుల సర్టిఫికెట్ జారీ చేస్తామని, మరి ఏఇతర పనులకు సర్టిఫికెట్ జారీ చేయమని ఇతర పనులకు సర్టిఫికెట్ కావాలంటే కోర్టును ఆశ్రయించమనడం చాలా బాధాకరమన్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో కోర్టులు ఆశ్రయిస్తే ఉన్న సమయం దానికి వృధా అవుతుందని తరువాత సర్టిఫికెట్ వస్తే అది దేనికి పనిచేయదన్నారు. అధికారులు జారీ చేయాల్సిన సర్టిఫికెట్ దానిని కోర్టు ద్వారా తీసుకోమనడం ఎంతవరకు సమంజసమనన్నారు. దీనిపై ఇప్పటికైనా పైఅధికారులు స్పందించి మాసమస్యను పరిష్కరించగలరని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version