శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలంలోని నేరేడుపల్లి, వసంతాపూర్ గ్రామాలలో వివాహ శుభకార్యాలలో అలాగే అప్పయ్యపల్లిలో గృహప్రవేశ శుభ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభాపతి, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం మాట్లాడుతూ శుక్రవారం బీఆర్ఎస్ శ్రేణులు మేడిగడ్డ సందర్శన నిమిత్తం రోడ్డు మార్గాన వెళ్తున్నందున మండలంలోని మాందారిపేట స్టేజి వద్ద ఘన స్వాగతం పలకాలని మండల టిఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు గుర్రం రవీందర్, పిఎసిఎస్ డైరెక్టర్ భాగ్య రమేష్ బీఆర్ఎస్ నాయకులు ఎస్కే గౌస్, సంజీవరావు, గణేష్, యువజన నాయకులు బెర్గు రాకేష్, సతీష్, విజయ్, రాజేందర్, రవి, పాల్గొన్నారు.