దొంగల్లా పార్టీలు మారడం కాదు.. రాజీనామా చేసి గెలివాలని డిమాండ్
భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ స్పష్టం
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:-
భారాస లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఏమ్మెల్యే ల పైన భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్టీ మారిన ఎమ్మెల్యే లు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలవాలని డిమాండ్ చేశారు. దొంగల్లా పార్టీలు మారడం కాదన్నారు. భారాస నుంచి ఎంత మంది ఎమ్మెల్యేలు పోయినా వచ్చిన నష్టమేమి లేదని రవీందర్ యాదవ్ పేర్కొన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లే వారికి ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని వెల్లడించారు. ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా నియోజవర్గలోని పార్టీ నేతలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెరుపు వేగంతో భారాస పుంజుకుంటుందని, రానున్న అన్ని ఎన్నికల్లో భారాస సత్తా ఎంటో చూపిస్తామంటూ పేర్కొన్నారు. పదేళ్లు అధికారం అనుభవించిన నేతలకు ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. నియోజకవర్గలలో భారాస నేతలు ఉద్యమకారులు గతం లో వాళ్ల తీరుతో ఎంతో ఇబ్బందులు పడ్డారని వెల్లడించారు. అన్ని డివిజన్ లోనూ కొత్త నాయకులను తయారు చేసుకుంటామన్నారు. యువ రక్తం తో భారాస అన్నింటిని ఎదుర్కొని నిలబడుతుందన్నారు. ప్రజా సమస్యలపై నిలదీస్తామని, ఎంతటి వరకైనా పోరాటం కొనసాగిస్తామంటూ రవీందర్ యాదవ్ వెల్లడించారు. కేసీఆర్, కేటీఆర్ ఎన్నో అవకాశాలు ఇచ్చారని గుర్తు చేశారు. కేటీఆర్ పై విమర్శలు చేస్తూ చూస్తూ ఊరుకోం అని హెచ్చరించారు.