హసన్ పర్తి మండల ప్రజా ప్రతినిధుల ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

హసన్ పర్తి / నేటి ధాత్రి

హనుమకొండ జిల్లా హాసన్ పర్తి మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం నందు జడ్పిటిసి, ఎంపిపి, వైస్ ఎంపిపి, ఎంపిటిసి లు ఆత్మీయ వీడుకోలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వర్ధన్నపేట ఎమ్మెల్యే ను ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది బొకే ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటి తదనంతరం మండల ప్రజా ప్రతినిధుల పదవి కాలం ముగిసిన సందర్భంగా పదివి కాలంలో వారు ప్రజలకు చేసిన సేవలను గుర్తించి వారిని శాలువాలతో సత్కరించి అభినందలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పదవి ఐపోయిందనే భావన ఉండకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పట్ల ముందుండాలని నా సహాయ సహకారాలు మీకు ఉంటాయని తెలిపారు. హసన్ పర్తి మండలాన్ని అభివృద్ది చేయడానికి అన్ని విధాలుగా నా తోడ్పాటు ఉంటుందని అన్నారు.
ఈ ఆత్మీయ వీడుకోలు కార్యక్రమంలో ఎంపిపి కేతపాక సునీత – రాజు, జడ్పిటిసి రేణుకుంట్ల సునీత, వైస్ ఎంపిపి బండ రత్నాకర్ రెడ్డి, ఎంపీటీసిలు ఆకుల ఇంద్రయ్య, బండారి రజిత, కొయ్యాడ దీపిక, గౌరు సుమతి, వల్యకొండ హరికంత్ రావు, జట్టి మంజుల, పల్లె విజయ, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు షేక్ లాల్, ఎంపీడీవో, ఎమ్మార్వో, ఎపిమ్, ఏపీవో, అధికారులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version