చెన్నూరు, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును కొత్తగా వాస్తు ప్రకారంగా రూపురేఖలు మార్చి కొత్త హంగులతో నూతనంగా తీర్చిదిద్ది గురువారం రోజున ఎమ్మెల్యే వివేక్ దంపతులు దగ్గరుండి యజ్ఞ యాగాదులు, ప్రత్యేక పూజలు మరియు సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహించి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు, కాంగ్రెస్ యువ నాయకుడు గడ్డ వంశీ కృష్ణ, జిల్లా మరియు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.