కొల్చారం, (మెదక్) నేటిధాత్రి :-
దుర్గ మత ఆశీస్సు లు అందరికి ఉండాలని , దుర్గామాత కృపకటాక్షాల ఈ ప్రాంతం అంత పడి పంటల తో, సుభిక్షంగా ఉండాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు కొల్చారం మండలంలోని రంగంపేట గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్టించిన దుర్గామాత ను సునీతా రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కమిటీ సభ్యులు సునీతా రెడ్డి ని శాలువాల తో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సునీతా రెడ్డి మాట్లాడుతూ అమ్మవారి కృపకటాక్షాల తో పడి పంటలు సుభిక్షంగా పండి , అందరూ ఆయుఆరోగ్యాల తో ఉండాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కొల్చారం మండలం బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీ శంకర్ గుప్తా, కొల్చారం మండలం బిఆర్ఎస్ పార్టీ యువత విభాగం అధ్యక్షుడు తుంకులపల్లి సంతోష్ రావు , బి ఆర్ఎస్ పార్టీ నాయకులు సంతోష్ కుమార్ , డిసిసి మాజీ చైర్మన్ ఎస్ నరేందర్ రెడ్డి, డిసిసి వైస్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్, మోత్కు మల్లేశం, పోతoశెట్టిపల్లి మాజీ సర్పంచ్ చిట్యాల యాదయ్య , తలరి దుర్గేష్, వేమారెడ్డి. సోమ నర్సింలు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
– ఎమ్మెల్యేతో ఆటో డ్రైవర్ల ఆవేదన…
కొల్చారం మండలం రంగంపేట ప్రాథమిక సహకార ఆవరణలో స్థానిక నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి శుక్రవారం మధ్యాహ్నం వచ్చిన సందర్భంగా కొల్చారం మండలం చెందిన ఆటో డ్రైవర్లు వారి ఆవేదనను ఎమ్మెల్యేతో చెప్పుకున్నారు. వెంటనే ఆమె మాట్లాడుతూ మీ సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపడతానని ఆమె అన్నారు.