నడికూడ,నేటి ధాత్రి: మండలంలోని కౌకొండ గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్, సి డి పి నిధుల నుంచి రూ.26 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని శనివారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారిగా గ్రామానికి వచ్చిన రేవూరి ప్రకాశ్ రెడ్డి కి గ్రామస్తులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తో పాటు పంచాయతీ వార్డు సభ్యులు పుష్పగుచ్చం అందించి శాలువ కప్పి సత్కరించారు.
అనంతరం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని అన్నారు.గ్రామంలో అనేక సమస్యలు నా దృష్టికి తీసుకువచ్చారని ప్రాధాన్యత క్రమంలో వాటిని పూర్తి చేసేందుకు తాను కృషి చేస్తానని అన్నారు.
గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల దనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిందని రాష్ట్ర ఆర్థిక వాస్తవ పరిస్థితిని ప్రజల ముందు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని ఇప్పటికే రెండు గ్యారెంటీలు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీ 10 లక్షలు రెండు గ్యారెంటీలు అమలు చేసామని మిగతా గ్యారెంటీ హామీలపై ఎటువంటి అపోహలకు గురి కావద్దని అన్నారు.
తాను రాజకీయాల కన్నా ప్రజల ఆర్థిక సామాజిక అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తానని యువతకు ఉపాధి అవకాశాలు పెంచడం, రైతులకు ఆర్థిక యంత్రాలు అందుబాటులోకి తెచ్చి పండించిన పంటలకు గిట్టుబాట ధర కల్పించి వారి ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా మొదటి ప్రాధాన్యతగా ఎంచుకున్నానని ప్రజల సహకారం ఉంటే గ్రామాల అభివృద్ధితో పాటు ప్రజల ఆర్థిక సామాజిక అభివృద్ధికి ప్రాధాన్యత క్రమంలో తాను నిబద్ధతతో పూర్తి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేకల రమేష్, ఉప సర్పంచ్ ముక్కెర సురేష్, ఎంపిటిసి మేకల సతీష్, జెడ్పిటిసి కొడతా సుమలత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కుడ్ల మాలహల్ రావ్, ఎంపీడీవో రాజేంద్రప్రసాద్, ఎంపిఓ అఫ్జల్,కార్యదర్శి విద్యాసాగర్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు మహమ్మద్ మహబూబ్ పాషా తదితరులు పాల్గొన్నారు.