నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది గెలుపు ఖాయమే..

# జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్

# పెద్ది గెలుపు కోసం దేవాలయంలో పూజలు
నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి :

నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికె దక్కిందని దీంతో భారీ మెజారిటీతో గెలుపు ఖాయమే అని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ తెలిపారు.ఎమ్మెల్యే పెద్ది గెలుపు కోసం బిఅర్ఎస్ పార్టీ మండల కమిటీ అధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతున్నది.దుగ్గొండి మండలంలోని తిమ్మంపేట గ్రామంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం చేపట్టారు.ముందుగా గ్రామంలోని శ్రీ యోగానంద లక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజలకు ఏమి చేసారో చెప్పాలని డిమాండ్ చేశారు.ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కృషి వల్ల గోదావరి జలాలతో నర్సంపేట సస్యశ్యామలం అయిందన్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం కోసం 650 పడకల జిల్లా ఆసుపత్రి,మెడికల్ కళాశాల,రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు తెచ్చారని వివరించారు.కాంగ్రెస్ పార్టీ చెప్పే అబద్ధపు ప్రచారాలు వినొద్దని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమములో మండల పార్టీ అధ్యక్షులు సుకినే రాజేశ్వర్ రావు,ఎంపీపీ కాట్ల కోమల భద్రయ్య, క్లస్టర్ ఇంచార్జ్ ఊరటి మైపాల్,సొసైటీ నర్సంపేట డైరెక్టర్ తోటకూరి రాజు, గ్రామ సర్పంచ్ మోడెం విద్యాసాగర్, గ్రామపార్టీ అధ్యక్షులు దొనపాటి జెనార్దన్ రెడ్డి, ఉప సర్పంచ్ కత్తి యాకంభ్రం, సీనియర్ నాయకులు అనుమాండ్ల సమ్మిరెడ్డి,ఏలకంటి కుమారస్వామి,బీరం ప్రభాకర్ రెడ్డి, తోటకూరి శ్రీనివాస్,సంకటి భాస్కర్,దొనపాటి ఈశ్వరెడ్డి,దండు రాజు, కొలిపాక రమేష్, బురగాని వేణు,రొట్టె రాజేందర్,తోటకూరి సాంబయ్య, జన్నపురెడ్డి తిరుపతి రెడ్డి, గిన్నె భాస్కర్, కొక్కుల మొగిలి,మ్యాక రాజు, కడారి రాజు,దండు అఖిల్,కత్తి రమేష్, మామూనూరి విగ్నేష్,కల్వచర్ల రాము,ఒద్దుల చిన్న సాంబరెడ్డి, గంగాడి శ్రీనివాస్ రెడ్డి, కోమాండ్ల మహేందర్ రెడ్డి, కత్తి రవి,సంగి ఉపాల, ముఖ్య నాయకులు కార్యకర్తలు మరియు సోషల్ మీడియా నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version