ఎమ్మెల్యే పెద్ది వెంటే మున్సిపాలిటీ పాలకవర్గం

# ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం.

# ఖబర్ధార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లారా.. మా జోలికి వస్తే వదిలిపెట్టం.

# మున్సిపల్ చైర్మన్ గుంటి రజిని కిషన్,పాలకవర్గం

నర్సంపేట,నేటిధాత్రి :

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ గెలుపు ఖాయం కావడంతో ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ పాలకవర్గాన్ని బదనాం చేస్తున్నారని ఇప్పుడు ఎప్పుడు ఎమ్మెల్యే పెద్ది వెంటే ఉంటానని మున్సిపల్ చైర్మన్ గుంటి రజిని కిషన్ అన్నారు.నర్సంపేట మున్సిపాలిటీ అధికార పార్టీ కౌన్సిలర్స్ అసమ్మతితో ఉన్నారని ఒక పత్రికలో వచ్చిన కథనంపై వారు స్పందించారు.
ఖబర్ధార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లారా.. మాపై తప్పుడు ప్రచారాలు చేస్తే.. మా జోలికి వస్తే వదిలిపెట్టం అని బిఅర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు హెచ్చరించారు. పట్టణ కేంద్రంలోని బిఅర్ఎస్ పార్టీ కార్యాలయంలో మున్సిపాలిటీ పాలకవర్గం విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ గుంటి రజిని కిషన్ మాట్లాడుతూ ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం పట్ల ఒక పత్రికలో వచ్చిన కథనానికి బిఅర్ఎస్ పార్టీ మున్సిపల్ పాలకవర్గం మనోవేదనకు గురయ్యాయని పేర్కొన్నారు. గతంలో పాలకవర్గం అలిగిన మాట వాస్తవమే కాని ఎమ్మెల్యే పెద్ది సహకారంతో కలిసి కట్టుగా ఉన్నామని చెప్పారు.మున్సిపాలిటీలో పాలకవర్గం కలిసికట్టుగా ఉంటూ 24 వార్డుల్లో అభివృద్ధి సాదిస్తున్నామని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఇలాంటి దుష్ప్రచారాలను పట్టణ ప్రజలు నామ్మద్దని చైర్మన్ కోరారు.మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గానికి
గోదావరి జలాలు,మెడికల్ కళాశాల,జిల్లా ఆసుపత్రి,అనేక సంక్షేమ పథకాలు తెచ్చిండు దొంతి మాధవరెడ్డి ఇక్కడికి ఏమి తెచ్చాడు.ఏమి ఇచ్చాడు.ఎందుకు ఎమ్మెల్యే పెద్దికి వ్యతిరేకంగా ఉంటాము అని పలువురు కౌన్సిలర్లు ప్రశ్నించారు.కష్టకాలంలో
ప్రజలకు ఉన్న అవసరాలను ఎమ్మెల్యే పెద్ది తీర్చారు కానీ మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఇంతకాలం ఎక్కడికి పోయారు కష్టకాలంలో ఉన్న ప్రజలు గుర్తుకురాలేదా అని విమర్శించారు.
ఎమ్మెల్యే పెద్ది గెలుపే లక్ష్యంగా 24 వార్డుల్లో మెజారిటీ తెచ్చేందుకు సమిష్టిగా కృషి చేస్తామని కౌన్సిలర్స్ హామీ ఇచ్చారు.శాసన సభ ఎన్నికలు రావడంతో కొత్త బిచ్చగాల్లుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుగుతున్నారని నర్సంపేటలో అభివృద్ధి చేసింది ఎవరో ప్రజలు గమనిస్తున్నారని ఆరోపించారు.వరంగల్ ఉమ్మడి జిల్లాలో ముందుగా గెలిచేది నర్సంపేట బిఅర్ఎస్ అభ్యర్థి అని కాంగ్రెస్ నాయకుడు జంగా రాఘవరెడ్డి ప్రత్యక్షంగా మీడియాతో చెప్పిన మాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులపై మండిపడ్డారు.మున్సిపాలిటీ పాలకవర్గం కలిసికట్టుగా ఉంది ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు.మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మినుములు రాజు,కౌన్సిలర్స్ దార్ల రమాదేవి, బానాల ఇందిర,నాగిశెట్టి పద్మ ప్రసాద్,వెల్పుగొండ పద్మ రాజు, గందే రజిత చంద్రమౌళి,జుర్రు రాజు,మహబూబ్ పాషా,శీలం రాంబాబు గౌడ్,గంప సునీత రఘునాథ్ గౌడ్, గోల్య నాయక్, కవిత,కో ఆప్షన్ సభ్యులు కొంకీస జ్ఞాన్ సాగర్ గౌడ్,సునీత,నాయకులు గుంటి కిషన్,గంప రాజేశ్వర్ గౌడ్,ప్రసాద్,పలువురు నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!