భూపాలపల్లి నేటిధాత్రి
స్వర్గీయ భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు నివాళులర్పించారు. భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్లో భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు దేవన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మన్మోహన్ సింగ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. ఆర్థికవేత్తగా, సంస్కరణల సారథిగా మన్మోహన్ సింగ్ పేరు ప్రఖ్యాతలు పొందారని అన్నారు. పీవీ నర్సింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మన్మోహన్ సింగ్ పూర్తిగా మార్చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా, విలక్షణ పార్లమెంటేరియన్ గా మన్మోహన్ సింగ్ సేవలు అందించారని తెలిపారు. వారి జీవితంలో ఎన్నో కీలక పదవులు అధిష్టించిన ఆయన సామాన్య జీవితం గడిపారని అన్నారు. మన్మోహన్ సింగ్ నిరాడంబరమైన కుటుంబం నుండి వచ్చి గొప్ప ఆర్థికవేత్తగా ఎదిగారని అన్నారు. వివిధ ప్రభుత్వ పదవుల్లో పనిచేసిన ఆయన దేశ ఆర్థిక విధానంపై బలమైన ముద్ర వేశారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తుచేశారు. ఈరోజు వారు లేని లోటు దేశానికి తీరని లోటని అన్నారు. పిసిసి మెంబర్ చెల్లూరు మధు జిల్లా ప్రధాన కార్యదర్శి బుర్ర కొమురయ్య పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్ కౌన్సిలర్లు దాట్ల శ్రీనివాస్ మంజల రవీందర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల అర్బన్ అధ్యక్షురాలు మాలతి మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు కమల బౌత్ విజయ్ కుమార్ తిరుపతి సమ్మయ్య రమణాచారి తదితరులు పాల్గొన్నారు