భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి పట్టణంలోని హార్ట్ ఫుల్ నెస్ మెడిటేషన్ ఇనిస్టిట్యూట్ విద్యార్థిని చెరుకుపల్లి పూజిత ఇటీవల వెలువడిన సిఏ(చార్టెడ్ అకౌంటెంట్)ఫలితాలలో ఉత్తీర్ణత సాధించగా, ఆ విద్యార్థిని పూజితకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శాలువా కప్పి, స్వీటు తినిపించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎస్సార్ మాట్లాడుతూ.. మెడిటేషన్ ద్వారా అమోఘమైన శక్తిని పొంది, ఏకాగ్రతతో ఎలాంటి ఒత్తిడి లేకుండా మొదటి అటెంప్ట్ లోనే చిన్న వయసులోనే పూజిత కఠినతరమైన సిఏ(చార్టెడ్ అకౌంటెంట్)పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం పలువురు విద్యార్థులకు ఆదర్శనీయమన్నారు. అనంతరం ఎమ్మెల్యేకు నిర్వాహకులు శాలువా కప్పి ఘన సన్మానం చేశారు. కాగా, పూజిత తల్లిదండ్రులు చెరుకుపల్లి రవీందర్ – మాధవి దంపతులిద్దరూ హార్ట్ ఫుల్ మెడిటేషన్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ గా ప్రిసిప్టర్ గా పనిచేస్తుండటం విశేషం. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు.