భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని సుభాష్ కాలనీ బెస్తల్ ఇవాంజికల్
ప్రార్థన మందిరంలో పాస్టర్ రాజవీర్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కేక్ కట్ చేసి చేసినారు క్రిస్టియన్స్ అందరికీ కమ్యూనిటీ భవన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుర్ర కొమురయ్య పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్ మహిళ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు నేరవట్ల కోమల అంబాల శ్రీనివాస్ భౌటీటీ బూత్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు