నర్సంపేట,నేటిధాత్రి :
హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలపై చర్చించట్లు ఎమ్మెల్యే తెలిపారు.నర్సంపేట అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం అవుతుందని త్వరలో నేరవేరనున్నదని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పేర్కొన్నారు.