మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంజీవ్ ముదిరాజ్ వారి తండ్రి గురువారం రోజు అనారోగ్య కారణాలతో మృతి చెందారు. మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ వారి ఇంటికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సందర్భంగా మాజీ మంత్రితో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, తదితరులు ఉన్నారు.