2కోట్ల 60లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్లు డ్రైన్ పనులు ప్రారంభం
నేటిధాత్రి, పోచంమైదాన్
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, వరంగల్ తూర్పు పరిదిలో, 22వ డివిజన్ మర్రి వెంకటయ్య కాలనీలో గురువారం ముఖ్యమంత్రి సహాయ నిధి (సి.ఎం.ఏ) ఫండ్ నుండి, 2 కోట్ల 60 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న సి.సి రోడ్లు డ్రైన్ పనులకు, ఇదే ప్రాంతంలో 15వ ఆర్థిక సంఘం నిధులు 50లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న డ్రైనేజీ, సి సి రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, జిడబ్ల్యూఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే, స్థానిక 22వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, తూర్పు కాంగ్రెస్ నాయకులు బస్వరాజు రాజ్ కుమార్, చిప్ప వెంకటేశ్వర్లు, మున్సిపల్ ఈఈ శ్రీనివాస్, స్థానిక డివిజన్ యూత్ నాయకులు ప్రమోద్, దయాకర్, రాజేష్ కాలనివాసులు సమ్మన్న, కాంట్రాక్టర్ సమ్మరావు తదితరులు పాల్గొన్నారు.