మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో పేరు గాంచిన నాయినిపల్లి మైసమ్మ ఛైర్మెన్ గా పెద్దకొత్తపల్లి సింగిల్ విండో చైర్మన్ బుడుగు శ్రీనివాస్ బుధవారం రోజు మైసమ్మ దేవస్థానంలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు హాజరై, శ్రీనివాస్ ని శాలువాతో సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
మంత్రి జూపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలిసి నాయినిపల్లీ మైసమ్మ తల్లిని దర్శించుకున్నారు.అమ్మ వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడలని మంత్రి జూపల్లి నూతన ఛైర్మెన్ కి సూచించారు.
ఈ కార్యక్రమంలో పెద్దకొత్తపల్లి మండల ఎంపిపి సూర్య ప్రతాప్ గౌడ్ , జెడ్పీటీసీ మేకల గౌరమ్మ చంద్రయ్య ,నియోజకవర్గంలోని అన్ని రకాల ప్రస్తుత మాజీ ప్రజాప్రతినిధులు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.