జగిత్యాల నేటి ధాత్రి
ధర్మపురి కి విద్య వైద్యం అందించడంలో ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తాం అని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి వర్యులు దామోదర రాజనర్సింహ అన్నారు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి వర్యులు దామోదర రాజనర్సింహ శుక్రవారం రోజున కుటుంబ సమేతంగా ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకొని,అభిషేకము,హోమము,స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.వారి వెంట ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉన్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ అధికారులు మరియు అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు మరియు శేష వస్త్రా న్ని అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి 100 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్,నర్సింగ్ కాలేజీ మంజూరు, ఎంసిహెచ్ లో మరియు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో వైద్య సిబ్బంది నియామకం, ప్రస్తుత సిహెచ్ సి లో శవ పంచనామ జరుపుట వంటి పలు సమస్యలను తన దృష్టికి తీసుకురావడం జరిగిందని వాటన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని ధర్మపురికి విద్య వైద్యం అందించే విషయంలో ప్రభుత్వం నుండి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగనబట్ల దినేష్,మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వేముల రాజేష్,సుముక్ జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు చిలుముల లక్ష్మణ్. ధర్మపురి నియోజకవర్గ యువజన అధ్యక్షులు సింహరాజ్ ప్రసాద్. జక్కు రవీందర్. రాజేష్ లక్ష్మణ్ . రవి. సాగర్ నరేందర్ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు దితరులు పాల్గొన్నారు