ఎంపీడీవో ఎల్ భాస్కర్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలోని గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో పేరు నమోదు చేసుకోని వారు ఈ నెల పదో తేదీలోగా సంబంధిత అధికారులను కలిసి నమోదు చేసుకోవాలని ఎంపీడీవో ఎల్ భాస్కర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు సర్వే గణపురం మండలంలో 95 శాతం పూర్తయిందని మిగిలిన దరఖాస్తు దారులు వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన వారు ఇందిరమ్మ ఇంటి సర్వేలో పేర్లు రానివారు కూడా 10వ తేదీలోపు సంబందిత గ్రామ పంచాయతీ కార్యదర్శి దగ్గర సర్వే నమోదు చేసుకోవాలని ఎంపీడీవో ఎల్ భాస్కర్ విజ్ఞప్తి చేశారు.