పెండింగ్ వేతనాలు చెల్లించి, ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయాలి
ఎంఈఓ కు వినతి పత్రం అందజేత
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలంలో మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎంఈఓ కు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వము సరైన సమ యంలో బిల్లులు చెల్లించగా అవస్థలు పడుతున్నటువంటి వంట కార్మికులను ఆదుకోవా లని మరియు కోడిగుడ్లు ధరలు విపరీతంగా ఉన్నందున వారానికి మూడుసార్లు పెట్టడం వీలు కాదని వినతి పత్రం ఇవ్వడమైనది. పెరుగు తున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని ప్రతి విద్యార్థికి 25 రూపాయలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల మ్యానిఫెస్టో పెట్టిన విధంగా పదివేల రూపాయలు గౌరవ వేతనం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.వంట కార్మికులకు ప్రమాద బీమా అదేవిధంగా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని పని భద్రత కల్పించాలని ప్రభుత్వా న్ని కోరడమైనది. లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వానికి తెలియ జేశారు .ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్ముల రామ్మూర్తి,మండల అధ్యక్షు రాలు మామిడి రాధమ్మ, దాసరి దేవక్క, మామిడి స్వరూప తదితరులు పాల్గొన్నారు.