మెపా అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ దంపతుల ప్రత్యేక పూజలు

గణపురం నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో
కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో కార్తీక మాస ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం ముదిరాజ్ ఎంప్లాయిస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్-సంగీత దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోటగుళ్ళకు వచ్చిన శ్రీనివాస్ సంగీత దంపతులను ముదిరాజ్ మహాసభ మండల నాయకుల ఆధ్వర్యంలో శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం అర్చకులు నాగరాజు వారికి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ జిల్లా నాయకులు చాడ కృష్ణస్వామి ముదిరాజ్ సోషల్ మీడియా ఇన్చార్జి జోడు ప్రదీప్ ముదిరాజ్, మెపా జిల్లా ప్రధాన కార్యదర్శి కౌటం రమేష్ ముదిరాజ్, జిల్లా నాయకులు ఆకుల సుభాష్,మెపా జిల్లా కోశాధికారి జోడు ఈశ్వర్, అల్లం స్వామి, జిల్లా సంయుక్త కార్యదర్శి సమ్మెట కృష్ణ, మత్స్యశాఖ మాజీ సొసైటీ చైర్మన్ మునగాల రమేష్ ముదిరాజ్, ముదిరాజ్ మహాసభ మండల యూత్ అధ్యక్షులు వెంకటేష్ ముదిరాజ్, ఈడ బోయిన రాకేష్ ముదిరాజ్ శివకృష్ణ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు._

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version