రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన దైవాల పరశురాములు గౌడ్ ఇటీవలే అనారోగ్యంతో చనిపోయి తన ఇద్దరు ఆడపిల్లలు తల్లితండ్రి లేక దిక్కుతోచని స్థితితో అనాధలైన విషయం విదితమే. ఇట్టి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకున్న గోపాలరావుపేట గ్రామానికి చెందిన నేచర్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో బాధిత కుటుంబానికి ఇరవై ఏడువేల పదకొండు రూపాయల నగదుతో పాటు ఇరవై ఐదు కిలోల బియ్యం అందజేశారు. ఇంకెవరైనా దాతలు ఉంటే మానవత దృక్పథంతో తమకు తోచిన విధంగా ఎంతో కొంత ఆర్థిక సహాయం అందజేస్తే ఈచిన్నారుల బంగారు భవిష్యత్ కొరకై మనమందరం మార్గం చూపించిన వారము అవుతామని ఈసందర్భంగా నేచర్ యూత్ క్లబ్ యాజమాన్యం విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఆర్థిక సహాయం చేసే దాతలు వారి కుటుంబ సభ్యులైన కత్తి మధు సెల్ నెంబర్ 9849262491కు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా పంపాలని తెలియజేశారు. ఈకార్యక్రమంలో నేచర్ యూత్ క్లబ్ అధ్యక్షులు కాసారపు పరుశురాం గౌడ్, ప్రధాన కార్యదర్శి బుర్ర శ్రీకాంత్ గౌడ్, ఉపాధ్యక్షులు పైండ్ల శ్రీనివాస్, గడ్డం రత్నాకర్, ప్రచార కార్యదర్శి దాసరి రవి శాస్త్రి, నేరెళ్ల అజయ్, గాజరవేణి మహేష్, కాసారపు రాజు, దాసరి అనిల్, గుంటి రాజు వెంకట్రావుపల్లి మాజీ సర్పంచ్ జవ్వాజి శేఖర్, న్యాయవాది కత్తి మధు, గ్రామప్రజలు, తదితరులు పాల్గొన్నారు.