రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన అంబేడ్కర్ యువజన సంఘం సభ్యులు కెసిఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరారు. గంగాధరలో గోపాలరావుపేట అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షులు రేణిగుంట అశోక్, ఉపాధ్యక్షులు దాసరి అనిల్, సంఘ సభ్యులు సిపెల్లి సంపత్, హరీష్, సాగర్, మధు, రాజు, శేఖర్, వెంకటేష్, ప్రశాంత్, సిద్ధూ, మనోజ్, అరవింద్, డేవిడ్ రాజ్, వంశీ, దాదాపు యాభై మంది యువకులకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సుంకె రవిశంకర్. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక బిఆర్ఎస్ పార్టీ చోప్పదండి నియోజకవర్గ అభ్యర్థి సుంకె రవిశంకర్ గెలుపు కొరకు బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రామడుగు మండల అధ్యక్షులు గండ్ల జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ దాసరి రాజేందర్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ కోలిపాక మల్లేశం, గ్రామశాఖ అధ్యక్షులు వేల్పుల హరికృష్ణ, నాయకులు పూడూరి మల్లేశం, అరుణ్ కుమార్, పాపిరెడ్డి, బసంతం, శ్రీనివాస్, ఎడవెల్లి ఆనందం, దాసరి బాబు, సిపెల్లి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.