నేటిధాత్రి, వరంగల్ తూర్పు
మట్టేవాడ పోలీస్ స్టేషన్ ఇన్స్ స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన గోపి శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ను మర్యాద పూర్వకంగా కలుసుకొని పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఇన్స్ స్పెక్టర్లకు పోలీస్ కమిషనర్ ముందుగా అభినందనలు తెలియజేసారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నిజాయితీతో విధులు నిర్వహిస్తూ, న్యాయం జరుగుతుందనే భరోసాను బాధితులకు కల్పిస్తూ, ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ విధులు నిర్వహించాలని పోలీస్ కమిషనర్ తెలిపారు.