గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్ల బహుకరణ
పరకాల నేటిధాత్రి
పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గణిత ఫోరం మండల శాఖ అధ్యక్షులు దొమ్మటి భద్రయ్య అధ్యక్షతన 10వ తరగతి విద్యార్థులకు గణితంలో ప్రతిభ పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు సిహెచ్ సురేందర్ పాల్గొన్నారు.అనంతరం మాట్లాడుతూ మ్యాథమెటిక్స్ అనేది మన నిత్యజీవితంలో ప్రతి అడుగన ఉపయోగపడుతుందని,ఇలాంటి పోటీలను నిర్వహించడం ద్వారా విద్యార్థుల ప్రతిభను వెలికి తీయవచ్చని అది సమాజానికి ఎంతో ఉపయోగమైన కొత్త ఆవిష్కరణలు ఏర్పడడానికి దోహదం చేస్తుందని తెలిపారు.గెలుపొందిన విద్యార్థులందరి శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లా స్థాయిలో జరగబోయే పోటీలలో కూడా మంచి ప్రతిభను కనబరిచి మండలానికి మంచి పేరు తేవాలని అన్నారు.అలాగే ఓడిన విద్యార్థులు నిరాశ చెందకుండా తదుపరి పోటీలలో ఉత్సాహంగా పాల్గొని విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ గెలుపొందిన విద్యార్థులు ఏ.వినయ్ జడ్పీహెచ్ఎస్ బాయ్స్ పరకాల ప్రథమ స్థానం,ఎస్.గణేష్ జడ్పిహెచ్ఎస్ వెల్లంపల్లిద్వితీయ స్థానం,ఎం.చిన్నారి జడ్పిహెచ్ఎస్ వెల్లంపల్లి తృతీయ స్థానం,తెలుగు మాధ్యమంలో నిలిచారు.ఆంగ్ల మాధ్యమంలో జి.జస్వంత్ గౌట్ హైస్కూల్ పరకాల సిహెచ్.అజయ్ ప్రభుత్వ పాఠశాల పరకాల,వి.నందిని జడ్.పి.హెచ్.ఎస్ గర్ల్స్ పరకాల,రెసిడెన్షియల్ స్కూల్స్ విభాగంలో జె.నాగలక్ష్మి సోషల్ వెల్ఫేర్ పరకాల గర్ల్స్,ఎం.త్రివేణి సోషల్ వెల్ఫేర్ ఆత్మకూర్ గర్ల్స్,ఏ.సుస్మిత సోషల్ వెల్ఫేర్ ఆత్మకూర్ గర్ల్స్ విజేతలుగా నిలిచారు.అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో మండల మాథ్స్ ఫోరం ప్రధాన కార్యదర్శి అజ్మీర రాజారాం,మండలంలోని వివిధ పాఠశాలల గణిత ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.