మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఊట్కూర్ మండలం చిన్నపొర్ల గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భూతగాదాలతో శుక్రవారం సంజప్ప హత్యకు గురైన విషయం విదితమే. కాగా నేడు సంజప్ప అంత్యక్రియలు జరగనున్నాయి. దీంతో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఈఘటనలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేయగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.