మార్క్సిజమే సకల సమస్యల పరిష్కారానికి మార్గం

సిపిఎం రాష్ట్ర నాయకులు జే వెంకటేష్

సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు

భూపాలపల్లి నేటిధాత్రి

భారత కమ్యూనిస్టు పార్టీ మారుస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 14.15 తేదీలలో పార్టీ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నాము.
మొదటి సెషన్ లో సిపిఎం పార్టీ కార్యక్రమాన్ని పార్టీ రాష్ట్ర నాయకులు జె. వెంకటేష్ బోధించారు.
సమాజాన్ని అనేకమంది తత్వవేత్తలు అనేక విధాలుగా పరిశీలించారు పరిశోధించారు. కార్లు మార్చకుండా ఈ సమాజాన్ని పరిశీలించి పరిశోధించి కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక కార్యక్రమం పెట్టుబడే దారి విధానం అనేటువంటి గ్రంధాన్ని రూపొందించారు. సమాజ మార్పుకు వర్గ పోరాటాలే శోదకశక్తి. మార్క్స్ సిద్ధాంతమే సకల సమస్యల పరిష్కారానికి మార్గమని అన్నారు. ఆదిమ సమాజం నుండి బానిస సమాజం ఏర్పడింది. బానిసలు బానిస యజమానుల మీద తిరుగుబాటు చేసి కొత్త సమాజాన్ని ఏర్పాటు చేశారు. ఆ కొత్త సమాజమే ఫీడలు సమాజము. ఫీడలు సమాజంలో రైతులు కూలోళ్ళు పోరాటం చేసి క్రీడలు రద్దు చేసి అర్థ భూస్వామ్య పెట్టుబడుదారి సమాజము ఏర్పడింది. ఈ సమాజంలో నిరుద్యోగం పెరిగింది. కనీస కూలి రేట్లు కరువయ్యాయి. దళితులు గిరిజనుల మీద దాడులు పెరిగాయి. ఉపాధి పనులు అడుగంటాయి. ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. ప్రభుత్వ భారాలు పెరిగాయి. దానికి తగ్గట్టుగా పని పెరగలేదు డబ్బులు పెరగలేదు. ఆకలి సావులు ఆత్మహత్యలు రోజురోజు పెరుగుతున్నాయి. పెట్టుబడుదారులు భూస్వాములు బాగా పెరుగుతున్నారు. శతకోటీశ్వర్లుగా తయారవుతున్నారు. భారత పెట్టుబడుదారులు విదేశీ సామ్రాజ్యవాదులతో మీలా కట్ అవుతున్నారు.
రెండవ సెషన్ లో పార్టీ నిర్మాణ సూత్రాలు పని పద్ధతులు అనే క్లాసు పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు బోధించారు. సిపిఎం పార్టీ సభ్యులు, ప్రజా సంఘాలు, అనుబంధ సంఘాలు ప్రజల స్థానిక సమస్యలపై సమరశీల పోరాటాలు చేయాలని అన్నారు. మేడిగడ్డ అన్నారం భూనిర్వశితుల సమస్యలు, జిల్లా కేంద్రానికి రైల్వే మార్గం, సింగరేణి,జనకో భూనిర్వశితుల సమస్యలు, జిల్లా కేంద్రంలో బీఈడీ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు కోసం, సింగరేణి జనకో ఆధారిత పరిశ్రమలు, సిమెంటు కర్మాగారం, కోల్ శుద్ధి కర్మాగారం, ఎరువుల కర్మాగారంఏర్పాటు కోసం.ఇంటి పట్టాల కోసం, పోడు భూముల పట్టాల కోసం, సాగునీరు తాగునీరు కోసం, కార్మికుల కనీస వేతనాల కోసం, రైతుల గిట్టుబాటు ధరల కోసం, ఉపాధి హామీ పనుల కోసం, తునికి ఆకు బోనస్ కోసం, దళిత గిరిజన మహిళా సమస్యల పరిష్కారానికి, విద్యార్థి యువజన సకల సమస్యల పరిష్కారానికి, వృత్తిదారుల సమస్యల పరిష్కారానికి పెండింగ్ లో ఉన్న సమస్యల సాధన కోసం ప్రభుత్వాల మీద ఒత్తిడి బెంచి సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు.
రెండు రోజులపాటు జరిగిన క్లాసులకు పార్టీ జిల్లా నాయకుడు గుర్రం దేవేందర్ ప్రిన్సిపాల్ గా వ్యవహరించగా, ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు వి రాజయ్య, శ్రీకాంత్, ప్రీతి లాతో పాటు పార్టీ నాయకులు ఆకు దారి రమేష్, గడప శేఖర్, మేకల మహేందర్, సిహెచ్ రవికుమార్, ఎం రాజేందర్, వంగాల విజయలక్ష్మి, కొండపాక రజిని, నూనెటి నరేష్, భారతక్క, బిక్షపతి, గోపాల్, పాదార మల్లయ్య, ఈశ్వర మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version