చిట్యాల, నేటి ధాత్రి :
జయ శంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకరణ మహోత్సవ కార్యక్రమం తేదీ 08-08-2024 రోజున చిట్యాల మార్కెట్ యార్డు ఆవరణలో ఉదయం 10 గంటలకు నిర్వహించు ప్రమాణ స్వీకరణ మహోత్సవ కార్యక్రమానికి అదిరత మహారధులు విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి.
కార్యక్రమానికి భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్నారు. అలాగే స్టేట్ కార్పొరేషన్ ట్రేడ్ యూనియన్ చైర్మన్ ఐతె ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులు మరియు మాజీ జెడ్పిటిసిలు ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు అధికారులు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని ఆహ్వానించనైనది