హసన్ పర్తి/ నేటి ధాత్రీ
హైదరాబాద్ లోని గాంధీ భవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ధీపాదాస్ మున్షి నీ వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ కె ఆర్ నాగరాజు, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిళి వెంకట్ రాంరెడ్డి, ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీ మాజీ సర్పంచ్‌లు బండా జీవన్‌రెడ్డి, కేతపాక భగత్, వేముల రామరాజు, భూక్య రాజు పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి తోకల లక్ష్మా రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తంగెళ్లపల్లి తిరుపతి, మధన్ గౌడ్, తోకల జగన్, సంధరాజు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.