రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండల ఎంపిడిఓగా బాధ్యతలు చేపట్టిన రాజేశ్వరిని రామడుగు మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈసందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు రామడుగు మండలంకు సంబంధించి పలు అభివృద్ధి పనులు గురించి, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను గురించి చర్చించడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించిన ఎంపిడిఓ అర్హులైన ప్రతీ పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడడంతో పాటు మండల పరిధిలోని ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు జరిగేలా చర్యలు చేపడతామని హామీ ఇవ్వడం జరిగినది. ఈకార్యక్రమంలో యువజన కాంగ్రెస్ చొప్పదండి అసెంబ్లీ ఉపాధ్యక్షులు మామిడి దిలీప్ కుమార్, యువజన కాంగ్రెస్ చొప్పదండి అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్, యువజన కాంగ్రెస్ రామడుగు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లె రాంరెడ్డి, యువజన కాంగ్రెస్ రామడుగు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు చొప్పదండి అనిల్, యువజన కాంగ్రెస్ వెంకట్రావుపల్లె అధ్యక్షులు పూసల వేణు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.