పరకాల నేటిధాత్రి
తెలంగాణలో ప్రభుత్వం చేపట్టిన 75వ వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా హన్మకొండ జిల్లా మల్లక్కపేట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు,గ్రామపంచాయతీ సిబ్బంది తో కలిసి మొక్కలను నాటడం జరిగింది.కాలుష్యాన్నీ నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరూ ఒక్క మొక్క నాటే కార్యక్రమన్ని తమ బాధ్యతగా తీసుకోవాలని మన మనుగడకు మొక్కలే ఆయువులని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది,అంగన్వాడీ టీచర్ లు,ఆయాలు,గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
