బైక్ ర్యాలీని విజయవంతం చేయాలి

డిసిసి వైస్ ప్రెసిడెంట్ చొప్పరి సదానందం
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ

ముత్తారం :- నేటి ధాత్రి

తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పర్యటనను పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే బైక్ ర్యాలీని రోడ్ షో ను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ తెలిపారు శనివారం రోజున మండలంలోని మచ్చుపేట గ్రామం నుండి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ ఉంటుందని రానున్న ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ ని అత్యధిక మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా రోడ్ షో కార్యక్రమం ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపారు మానేరు వాగు పై ఓడేడు గ్రామ సమీపంలో నిర్మిస్తున్న బ్రిడ్జి ఇటీవల కూలిపోగా సంఘటన స్థలాన్ని మంత్రి శ్రీధర్ బాబు పరిశీలిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version