మేళ్లచెరువు,నేటిధాత్రి.
ఈ నెల 19వ తారీఖున మేళ్లచెరువు మండల కేంద్రంలో జరగబోయే సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలనీ సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు ధరావత్ రవీందర్ నాయక్ పిలుపునిచ్చారు.ఈ సందర్బంగా జయంతి వేడుకలకు హాజరు కావాలని కోరుతూ స్థానిక తహశీల్దార్ పి. జ్యోతి,స్థానిక ఎస్సై పి. పరమేష్ కు ఆహ్వాన పత్రికను ఆ సంఘ నాయకులతో కలసి అందజేశారు.ఈ సందర్బంగా సేవాలాల్ మహారాజ్ సేవలను కొనియాడారు.మొట్ట మొదటి సరిగా మండల కేంద్రంలో జరుగుతున్న ఈ జయంతి కార్యక్రమానికి ఉమ్మడి మేళ్లచెరువు మండలంలోని గిరిజనులు,ప్రజాప్రతినిధులు,గిరిజన ఉద్యోగులు,యువతి, యువకులు ఇతర ప్రజాప్రతినిధులు,బంజారా కవులు, కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన మండల అధ్యక్షుడు బానోతు హుస్సేన్ నాయక్,మండల యువసేన నాయకులు బాబు నాయక్,మాజీ మండల అధ్యక్షుడు లావుడ్యా నాగేశ్వర రావు నాయక్,లావుడ్యా శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.