అన్న జీరో చూసుకో…

పెట్రోల్ బంకులో ఇది మాత్రమే చూస్తే మీకే లాస్

వేములవాడ నేటి ధాత్రి

పెట్రోల్ బంకులో వెళ్లగానే మెుదట వినిపించే విషయం అన్న జీరో చూసుకో. అయితే ఈ జీరో చూసుకుంటే సరిపోతుందా?
ఓ పెట్రోల్ బంకులో పనిచేసే వ్యక్తితో వేములవాడ నేటి ధాత్రి మాట్లాడించే ప్రయత్నం చేసింది ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం
ఇంధన ధరలు ఘోరంగా ఉన్నాయి. మధ్యతరగతి వాడు.. పెట్రోల్ బంకులోకి వెళ్లాలంటే.. ఏదో మంటలోకి వెళ్లినట్టుగా ఫీలవుతున్నాడు. వంద రూపాయలు కొట్టిస్తే.. రెండు రౌండ్లు తిరిగితే ఖతమ్. ప్రభుత్వాలను లోలోపల తిట్టుకుంటూ.. ఏం చేయలేక.. మళ్లీ మళ్లీ పెట్రోల్ బంకులకు వెళ్తూ.. జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. అయితే అక్కడ అక్కడ సరిగా ఉందంటే.. కొన్ని పెట్రోల్ బంకుల్లో మోసాలు జరుగుతూనే ఉన్నాయి.
చాలా పెట్రోల్ బంకుల్లో మీటర్ రీడింగ్‍లో సెట్టింగ్ చేస్తున్నట్టుగా ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి. పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకుని బయటకు వచ్చి బాటిల్‍లో తీసి చూస్తే.., ఇచ్చిన డబ్బుకు తగ్గట్టుగా పెట్రోల్ లేదని చాలా మంది గొడవలు చేసిన విషయాలు చూశాం. దీనికి బంకులో సెట్టింగ్ చేయడమే కారణంగా చెబుతున్నారు కొందరు ప్రముఖులు. పెట్రోల్ బంకులోకి వెళ్లగానే.. అన్న జీరో చూసుకోమని చెబుతారు. నిజానికి ఇది చాలా మంచి పద్ధతి. కస్టమర్‍ను అలర్ట్ చేయడం గుడ్. కానీ ఇందులోనే లాజిక్కు ఉంది. మనం పోయించుకునే పెట్రోల్‍ తక్కువ వస్తుందని చాలా మంది చెబుతూ ఉంటరు.
100, 200.. ఇలా జీరోతో ఎండ్ అయ్యేలాగా పెట్రోల్ కొట్టించుకుంటే మీటర్ రీడింగ్‍లో సెట్టింగ్స్ ఉంటాయని పలువురు అంటున్నారు. మనం 100 రూపాయల పెట్రోల్ కొట్టించుకుంటే అందదా 80 నిండి 90 రూపాయల వరకే రావొచ్చు. దీని ద్వారా వినియోగదారుడు చాలా మోసపోతున్నాడు. బైకులోకి పెట్రోల్ వెళ్లిన తర్వాత ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. కానీ కొంతమంది మాత్రం అనుమానం వచ్చి.. బాటిల్‍లోకి కూడా తీసి చూస్తారు. అలాంటప్పుడు అసలు విషయం బయటపడుతుంది.
‘వంద, రెండొందల రూపాయల్లో పెట్రోల్ కొట్టించుకోకపోవడమే మంచిది. లీటర్లలో కొట్టించుకుంటే మీకు లాభం. కొన్ని పెట్రోల్ బంకుల్లో మీటర్ రీడింగ్ సెట్ చేస్తారు అని ప్రచారం . అన్న చూసుకో అనగానే మీరు సరే అనుకుంటారు. కానీ వెనకాల జరిగే ప్రాసెస్ వేరే ఉంటుందట.పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌ను చాలా పొదుపుగా ఉపయోగించుకునే స్థితిలో ఉన్నాం. కానీ నేటికీ కొన్ని పెట్రోల్, డీజిల్ స్టేషన్లలో వినియోగదారులు మాత్రం నిరంతరం మోసపోతున్నారు. మీ వాహనానికి ఇంధనం నింపే ముందు, సున్నాని తనిఖీ చేయడంతో పాటు మీరు గుర్తుంచుకోవలసిన ఇతర అంశాలు కూడా ఉన్నాయి. అంటే సున్నా వద్ద ఉన్న మీటర్‌తో కూడా మీకు తక్కువ ఇంధనం వచ్చినట్టుగా మీరు అనుమానించినట్లయితే, ధృవీకరణ సాక్ష్యాలను చూపించమని మీరు కంపెనీని అడగవచ్చు.

దానిపై హక్కు మీకు ఉంది. అంతే కాదు ఇంధనం సరైన స్థాయిలో ఉందో లేదో తెలుసుకోవడానికి అక్కడ ఉన్న స్కేల్‌ను కూడా ఉపయోగించవచ్చు. అయినా కూడా ఆ పెట్రోల్ లేదా డీజిల్ స్టేషన్‌పై మీకు సందేహాలు ఉంటే కంప్లైంట్ చేయెుచ్చు. వినియోగదారుల ఫోరమ్ వెళ్లొచ్చు. నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ నంబర్ 1915లో ఫిర్యాదు చేసుకోవచ్చు. లేదు.. మేం అలాగే మోసపోతూ ఉంటాం అనుకుంటే.. ఇక మీ ఇష్టం.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version