పరకాల నేటిధాత్రి
పట్టణపరిధిలోని పెద్దరాజీపేటలో కాంగ్రెస్ నాయకులు మడికొండ సంపత్,శ్రీనుల ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి నిర్వహించారు.అనంతరం మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసినివాళులు అర్పించారు.1వ వార్డు కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో కులవివక్ష,అంటరానితనంపై పోరాటంచేసి,వెనుకబడిన బడుగు,బలహీన వర్గాలకు హక్కులు,మహిళలకు విద్యవకాశం కల్పించిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే గారని కొనియాడారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్.మడికొండ శ్రీను,కోడెపాక అమర్,బొజ్జం సాయి,మరుపట్ల మహేష్,గొడుగు రమేష్,బండి రామన్న,మోతే రాజయ్య,సిక్కుల రాజు,పెండెల ఓదెలు,మోతే పెద్ద రాజయ్య,బోయిని సురేష్,సూర తిరుపతి,సూర ఐలయ్య పాల్గొన్నారు.