భద్రాచలం నేటి ధాత్రి
భద్రాద్రి జిల్లాఎస్సీ సెల్ ఛైర్మెన్ చింతిరాల రవికుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు డిసిసి భద్రాద్రి జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే పొదేం.వీరయ్య
భగవాన్ దాస్ కాలనీ,అశోక్ నగర్ కాలనీ ,కొత్త,కాలనీ, ఏఎంసీ లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు
పొరిక బలరాం నాయక్ గెలుపుతో భద్రాచలం అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు డిసిసి భద్రాద్రి జిల్లా అధ్యక్షులు పొదెం వీరయ్య భగవాన్ దాస్ కాలనీ,అశోక్ నగర్ కాలనీ ,కొత్త,కాలనీ లలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది.
పార్టీ నాయకులతో కలిసి ఎంపీ అభ్యర్థి కోరిక బలరాం నాయక్ గెలిపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ నెల 13వ తారీఖున జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్న బలరాం నాయక్ ఎన్నికల గుర్తు హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న మండల అధ్యక్షులు పరిమి శ్రీనివాసరావు,సీనియర్ నాయకులు అడబాల వెంకటేశ్వరరావు,తంమళ్ల వెంకటేశ్వరరావు(టీవీ),కాపుల శ్రీను,బసవ రాజు,వాసిరెడ్డి సాంబశివరావు,నాయుడు, వరుణ్,అనిత్,సన్నీ మహిళా కాంగ్రెస్ నాయకులు.