వేములవాడ,నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో గురువారం చట్ట సభల్లో బీసీల వాట సాధన కోసం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వారు చేపట్టబోయే మహా పాదయాత్ర పోస్టర్ ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో కుల గణన బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించినందుకు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తరఫున ప్రభుత్వ విప్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ప్రభుత్వ విప్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బీసీల సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు.. బీసీల అభ్యున్నతికి పాటుపడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు.
తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వారు పండుగ సాయన్న ముదిరాజ్ స్వగ్రామం మీర్గావ్ పల్లె నుండి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కోట కిలాసాపూర్ వరకు నిర్వహిస్తున్న పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు.