కాశీబుగ్గ, నేటిధాత్రి
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాశీబుగ్గ 20వ డివిజన్ లో
శ్రీ సాయి గణేష్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నవ రాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రుల్లో బాగంగా బుదవారం నాడు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కాశీబుగ్గ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహా అన్నదాన కార్యక్రమంనకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన నాయకులు ఏపీ శ్రీను, యూత్ ఐకాన్ గణిపాక సుధాకర్, యూత్ సభ్యులు సురాశి శరత్, బిర్రు శివ, వర్ధి నవీన్, సాజన్, శ్రీకాంత్, వంశీ, రాజు, శివ, శివాజీ, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.