నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట మండలంలోని దాసరిపల్లి గ్రామంలో దాసరి రాజిరెడ్డి (డి ఆర్ ఆర్) ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ట్రస్టు సభ్యులు గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.గణపతి నవరాత్రి ఉత్సవాల దాత, విగ్రహ దాతగా మహాన్నదాతగా దాసరి ప్రవీణ రాజిరెడ్డి యూఎస్ఏ వారు దాతలుగా ఉన్నారు.గణనాథుడికి ట్రస్టు సభ్యులచే నిర్వహించిన ఉత్సవాలలో గ్రామంలోని ప్రజలు విగ్నేశ్వరుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా జరిపించారు.అనంతరం ట్రస్ట్ సభ్యులు ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో మేకల రాజేందర్, బి. బిక్షపతి, జి.సురేష్, లింగం, మాజీ సర్పంచ్ శ్రీను, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.