భద్రాచలం నేటి ధాత్రి
ఎన్ టి ఏ ప్రకటించిన నీట్ 20 24 ఫలితాలలో భద్రాచలం పట్టణానికి చెందిన లిటిల్ ఫ్లవర్స్ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించారు.
లిటిల్ ఫ్లవర్స్ విద్యార్థులైన బి శర్వాణి పావని.538/720 మార్కులు సాధించి 8071వ ర్యాంకు సాధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే చరిత్రను సృష్టించారు. అంతేకాకుండా మరో విద్యార్థిని బి మేఘన 495/720 మార్కులతో సత్తా చాటగా ఎన్ మేఘన 465/720 మార్కులు సాధించడంతో లిటిల్ ఫ్లవర్స్ కీర్తి ప్రతిష్టలు అంతకంతకు పెరిగాయి. వీరితోపాటు మణిదీప్ నూర్జహాన్ సమహార భాను శ్రీ నిశాంత్ తదితర విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి నీట్ లో హరతను పొందారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన సభలో లిటిల్ ఫ్లవర్స్ డైరెక్టర్లు మాగంటి ప్రసాద్ బాబు మాగంటి రమేష్ బాబులు మాట్లాడుతూ
పరీక్ష ఏదైనా విజయం మాత్రం లిటిల్ ఫ్లవర్స్ కే సొంతమని అన్నారు. ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడంతోపాటు ఎంసెట్ ఫలితాలలో అద్భుతమైన విజయాలు సాధించినా లిటిల్ ఫ్లవర్స్ విద్యార్థులు నీట్ లోనూ ప్రభంజనం సృష్టించారని కొనియాడారు. ఈ విజయానికి ప్రధానంగా ఉపాధ్యాయుల సమిష్టి కృషితో పాటు విద్యార్థుల తల్లితండ్రుల సహకారం మరువలేనిదని అన్నారు. ఈ విద్యా సంవత్సరంలో లిటిల్ ఫ్లవర్స్ విద్యాసంస్థలు సాధించిన అసాధారణ ఫలితాలు కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా సాధ్యం కాలేదని స్పష్టం చేశారు. ఈ ఫలితాలతో రెట్టింపు ఉత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు బషీర్ తో పాటు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు