పట్టించుకోని ఎక్స్ంజ్ శాఖ అధికారులు
కారేపల్లి నేటి ధాత్రి.
కారేపల్లి మండల కేంద్రంలోని వైన్స్ షాపుల నుండి బెల్ట్ షాపులకు తరలిస్తున్న అక్రమ మద్యం. యదేచ్వగా వైన్ షాపుల నిర్వాహకులు ఆటోల్లో మద్యంను పట్ట పగలే తరలిస్తూ మండల పరిధిలోని చుట్టుపక్కల గ్రామాల్లో నిర్వహిస్తున్న బెల్ట్ షాపులకు ఆటోల్లో అక్రమంగా మద్యంను తరలిస్తున్నారు. కారేపల్లి మండల కేంద్రంలో ఎక్సేంజ్ కార్యాలయం లేకపోవడంతో వైన్ షాపుల నిర్వాహకులు విచ్చలవిడిగా మద్యంను ఆటోలో తరలిస్తున్నారు. కారేపల్లి మండల కేంద్రం కి సుమారు 5 కిలోమీటర్ల దూరంలోని కారేపల్లి క్రాస్ రోడ్ యందు ఎక్స్చేంజ్ శాఖ కార్యాలయం ఉండగా ఎక్స్చేంజ్ అధికారులు మండల కేంద్రంలో లేకపోవడంతో వైన్స్ షాపుల నిర్వాహకులు ఇదే అదునుగా చేసుకొని ఆటోల్లో గ్రామాలకు మద్యం తరలిస్తున్నారు. వైన్స్ షాపుల నిర్వాహకులు లాభార్జన దేంగా ఆటోల్లో మద్యం సరఫరాను చేస్తున్నారు. కారేపల్లి మండల కేంద్రంలో యదేచ్ఛగా మెయిన్ రోడ్డు యందు బెల్ట్ షాపులు ఏర్పాటు చేసుకొని మద్యం అమ్మకాలు చేపడుతున్నారు. మద్యం అమ్మకాలు ఆటోలో తరలిస్తున్న ఎక్సేంజ్ శాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు.ప్రతిరోజు ఆటోల ద్వారా మద్యం అమ్మకాలు గ్రామాలకు జోరుగా కొనసాగుతున్న ఎక్సేంజ్ శాఖ సరఫరా పై కన్నేయక పోవడంతో ఇదే అదునుగా భావించిన వైన్స్ షాపుల నిర్వాహకులు మద్యం అమ్మకాలు బెల్ట్ షాపులకు విక్రయిస్తున్నారు.గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నందున యువత మద్యం సేవిస్తూ చేడు మార్గంలో పడుతున్నరని. మండలంలోని ప్రజలు బెల్ట్ షాపులను నిర్వహించకుండ అక్రమంగా తరలిస్తున్న మద్యంను అరికట్టి చర్యలు తీసుకొని మద్యం అమ్మకాలపై అదికారులు కన్నేసి మద్యం గ్రామాలకు కొనసాగకుండా చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఇట్టి విషయంపై కారేపల్లి మండల ఎక్సేంజ్ ఎస్సై రమణ ను వివరణ కోరగా ఆటోల్లో మద్యం బెల్ట్ షాపులకు తరలించేందుకు.అనుమతి లేవని వైన్ షాపు నిర్వాహకులు మద్యం అమ్మకాలు షాపుల్లోనే చేపట్టాలని బెల్ట్ షాపులకు ఆటోల్లో తరలించిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని వివరణలో ఎస్సై రమణ తెలిపారు.