సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి
మారేపల్లి మల్లేష్
నేటి ధాత్రి మొగుళ్ళపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో బెల్ట్ దందాను ప్రోత్సహిస్తున్న వైన్ షాపుల లైసెన్సును రద్దు చేయాలంటూ. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ అన్నారు. మొగులపల్లిలో రెండు మద్యం షాపుల యజమానులు సిండికేట్ గా ఏర్పడి మద్యం అమ్మకాల ముసుగులో బెల్టు దందాలను ప్రోత్సహిస్తూ సామాన్యులకు అధిక ధరలకు మద్యాన్ని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని . మొగుళ్లపల్లిలోని శ్రీ సాయి తిరుమల వైన్స్ ప్రత్యేకంగా బెల్టు షాపుల కోసమే నడుపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే వైన్ షాప్ లైసెన్స్ రద్దు చేయాలని రెండు మద్యం షాపులను ఒక షాపు మద్యం కొనుగోలుదారుల కోసం అమ్మకాలు జరుపుతుండగా మరొక షాపు మాత్రం ప్రత్యేకంగా బెల్టు షాపుల కోసమే నడుపుతున్నారని ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడం పలు విమర్శలకు దారి తీస్తుందని. సామాన్యులు తమ ఇష్టమైన మద్యం కొనుగోలు చేయడానికి వెళితే నచ్చిన బ్రాండ్ షాపులో ఉండదు అదే బెల్ట్ షాప్ లో మాత్రం అదే బ్రాండ్ ను ఎక్కువ ధరకు అమ్మకాలు జరుపుతున్నారని తప్పని పరిస్థితుల్లో కొనుగోలు చేసి మద్యం సేవించే పరిస్థితి సామాన్యులకు దాపురుస్తుందని. మండలంలో రెండు వందల నుండి మూడు వందలలోపు బెల్ట్ షాపులు నిరీచ్చగా నడుపుతున్నారని. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బెల్టు దందాను అరికట్టాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని, అంతేకాకుండా వైన్ షాప్ యజమానులు కొంతమంది వ్యక్తులను వైన్ షాప్ రైడర్లుగా నియమించుకొని వారితో ఎవరైనా పక్క మండలం నుండి మద్యం కొనుగోలు చేసి గ్రామాలకు తీసుకువస్తే వారి పైన దాడి చేస్తున్నారని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులపై చర్యలు తీసుకొని మొగలపల్లి మండలంలోని వైన్ షాప్ లైసెన్సులను రద్దు చేయాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.