పితృస్వామ్య భావజాలానికి వ్యతిరేకంగా పోరాడుదాం
* మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని. హిందుత్వ భావజాల వ్యతిరేక దినంగా పాటిద్దాం.
రక్షణ సోషల్ సర్వీస్ సొసైటీ అధ్యక్షురాలు.
లింగమల్ల రమాదేవి.
మహా ముత్తారం నేటి ధాత్రి.
మహా ముత్తారంలో రక్షణ సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది సమావేశాన్ని ఉద్దేశించి రక్షణ సోషల్ సర్వీస్ సొసైటీ అధ్యక్షురాలు లింగమల్ల రమాదేవి మాట్లాడుతూ.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రకటించి నేటికీ 114 సంవత్సరాలు అయింది తమపై జరుగుతున్న శ్రమదోపిడికి వ్యతిరేకంగా మెరుగైన కనీస సౌకర్యాల కోసం మహిళలు మీటింగులు పెట్టుకునే హక్కు కోసం పురుషులతో పాటు యూనియన్ లో కూడా భాగస్వామ్యం కల్పించాలని. మాల మహానాడు మహిళా ఓటు హక్కు కావాలని నిలదీస్తూ పోరాటాలు త్యాగాలు చేస్తూ. ఎనిమిది గంటల పని దినాన్ని వేతన ఒప్పందాలను తాత్కాలికమైన సమస్యలను సాధించుకోవడం జరిగింది
అమెరికా .రష్యా. యూరప్ లో వారి వేసిన సాధారణ పోరాటాలకు. సాంకేతికంగానే. మార్చి.8.ని. అంతర్జాతీయంగా ప్రతి ఏటా పోరాట స్ఫూర్తితో జరపాలని.1910.లో. డెన్మార్క్ రాజధాని కోపెన్హాగెన్లో నిర్వహించిన రెండవ అంతర్జాతీయ సోషలిస్టు సదస్సులో ఏకగ్రీవంగా అంగీకరించారు అప్పటినుండి మార్చి 8న.అంతర్జాతీయ శ్రామిక మహిళ పోరాట దినంగా హక్కుల సాధన కోసం అనేక దేశాల్లో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అన్నారు. మాల మహానాడు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు బందెల యాదలక్ష్మి మాట్లాడుతూ
మనవాద బ్రాహ్మణయ మతోన్మాదం. మహిళల నిర్ణయాధికారాన్ని కాలరాచే పితృస్వామ్యా భావజాలాన్ని బలోపేతం చేసే మోడీ మహిళా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మహిళలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రజాతంత్ర భారతావనిలో మహిళలు సంపూర్ణమైన రాజకీయ హార్దిక స్వయం నిర్ణయాధికారాన్ని సాధించ లేక పోయారని అన్నారు.
మన దేశంలో మహిళా రైతులు పంటలు పండిస్తున్నారని వారు పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధరలు లేక మహిళా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. స్త్రీశక్తి అధ్యక్షురాలు సుమలత మాట్లాడుతూ
నిత్యం మహిళలపై జరుగుతున్న హింస దాడులు అత్యాచారాలు హత్యల వ్యతిరేకంగా మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మహిళలు ఉద్యమించాలని. మహిళ హక్కుల రక్షణకై నిలబడాలని పితృస్వామ్య భావజాలానికి వ్యతిరేకంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల నాయకులు మంథని గీత. కందికొండ రమాదేవి. బూడిద సుస్మిత. మంథని సుజాత. సమ్మక్క. సరిత. వెన్నెల. రవళి. సరస్వతి. తదితరులు పాల్గొన్నారు.