సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కారేపల్లి మండల కార్యదర్శి వై ప్రకాష్.
కారేపల్లి నేటి ధాత్రి
సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ల రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల నాలుగున ఖమ్మం జిల్లా కేంద్రంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరవీరుడు అమరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సదస్సు వాల్ పోస్టర్లను కారేపల్లి మండలం పేరుపల్లిలో ఆవిష్కరించడం జరిగింది అనంతరం జరిగిన సదస్సులో మండల కార్యదర్శి వై ప్రకాష్ మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం నాటి నైజం నిరంకుశపు భూస్వామ్య ధనస్వామ్య వెట్టిచాకిరి నిర్మూలన కోసం పటేల్ పట్వారిలా అరాచకపు పెత్తనాలకు దోపిడీలకు వ్యతిరేకంగా దున్ని వానికి భూమి కావాలని మహోత్తర తెలంగాణ సాయుధ పోరాటంలో సాయుధ పోరాటమే సరైన మార్గమని రైతు కూలీలను అన్ని వర్గాల ప్రజలను ఐక్యం చేసి పోరాటంలో ముందుండి 1946 జూలై 4న విశ్వ రాక్షసుడైన విసునూరు దేశ్ముఖ్ రామచంద్ర రెడ్డి భూస్వామి గుండాల కాల్పులలో కామ్రేడ్ దొడ్డి కొమరయ్య అమరుడయ్యాడని ఆయన మార్గాన్ని ఎంచుకొని పోరాటాలు నిర్వహించి నైజాం రాజు పై తిరుగుబాటు చేసి 4000 మంది అమరులై పది లక్షల ఎకరాల భూస్వాముల భూములను కమ్యూనిస్టుల నాయకత్వంలో పేద ప్రజలకు మంచినారని 2000 గ్రామాలు విముక్తి అయినాయని నాటి పోరాటాల స్ఫూర్తితో జల్ జంగిల్ జమీన్ కొమరం భీమ్ పోరాటాలు నక్సల్బరీ శ్రీకాకుళం సిరిసిల్ల జగిత్యాల 1969 నుండి నేటికీ కొనసాగుతున్న గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాల ఫలితంగా 170 యాక్ట్ పీసా చట్టం 2006 అటవీ యొక్క చట్టం లాంటి అనేక హక్కులను చట్టాలను సాధించుకోవడం జరిగిందని ఎన్నో త్యాగాలతో సాధించుకున్న చట్టాలను నేటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేసి రైతులకు కార్మికులకు నష్టం కలిగించే 2022 నూతన అటవీ సంరక్షణ నియమావళి పేరుతో 44 కూడులుగా ఉన్న కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా మార్చి కోట్లాదిమంది రైతులను కార్మికులను బజారున పడేసిందని వీటన్నిటికీ వ్యతిరేకంగా హక్కుల సాధనకై అన్ని వర్గాల ప్రజలు ఐక్యమై తెలంగాణ రైతాంగ పోరాట స్ఫూర్తితో కామ్రేడ్ దొడ్డి కొమరయ్య ఆశయాల వారసులుగా పోరాటాలలో ముందు భాగాల నిలబడాలని ఈనెల నాలుగో తారీఖున ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో మధ్యాహ్నం 12 గంటలకు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రెండు రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో జరుగు సదస్సును అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరినారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల నాయకులు కే శ్రీనివాస్ రెడ్డి వై జానకి హలెం గురవయ్య చంద్రయ్య కోటయ్య నాగేశ్వరరావు సంపత్ బైరమల లక్ష్మయ్య అలం సుగుణ మంగమ్మ బుర్రకోటక్క వెంకన్న లక్ష్మయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.