నాగుర్లపల్లి సర్పంచ్, కనిపర్తి ఎంపీటీసి మరో 50 మంది బీఆర్ఎస్ నాయకులు
పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
రేగొండ మండలం నాగుర్లపల్లి గ్రామ సర్పంచ్ కుంట తిరుపతి, కనిపర్తి గ్రామ ఎంపీటీసీ సుష్మా స్వరాజ్ తండ్రి బల్గురి కోనారావు తో పాటు మరో 50 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు హన్మకొండలోని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్వగృహంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా, పార్టీలో చేరిన వారందరికీ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారిలో యూత్ కాంగ్రెస్ గ్రామ ప్రెసిడెంట్ ముత్యాల అజయ్ తో పాటు ముఖ్య నాయకులు చేరిక భుజంగరావు, వేల్పుల శ్రీకాంత్, పొన్నాల రాజు, పోశాల కరుణాకర్, ముత్యాల చంటి, ఎలవేన అనిల్, వంగరి రాజు, పుట్ట రాకేష్, కుంట దేవేందర్ తదితరులు ఉన్నారు.
Srinivas PRO To MLA Bhupalapally