మంచిర్యాల, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పత్తి విత్తనాలను నో స్టాక్ పేరుతో కృతిమ కొరత సృష్టించి ఎంఆర్ పి కంటే అధిక ధరలకు పత్తి విత్తనాలను అమ్ముతున్న దుకాణాల పై చర్యలు తీసుకోవాలని జిల్లాలో రైతుల అమాయకత్వాన్ని అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో కొన్ని దుకాణాలు డీలర్లు సిండికేట్ గా మారి పత్తి విత్తనాలు అనే సాకుతో అధిక ధరలకు అమ్ముతున్నారని తమ దృష్టికి వచ్చిందని జిల్లా వ్యవసాయ అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారని పూర్తిస్థాయిలో రైతులకు న్యాయం చేసే విషయంలో జిల్లా వ్యవసాయ అధికారులు పనిచేయాలని జిల్లాలో విత్తనాల వివరాలను ఆయా దుకాణదారులు నోటీసు బోర్డుపై ఉంచాలని ప్రతి పత్తి విత్తనం ధర నోటీసు బోర్డుపై ఉంచాలని అంతే కాకుండా విత్తనాలు కొంటున్న రైతుల ఆధార్ కార్డుతో రైతులకు విత్తనాలు అమ్మాలని ఆ విధంగా జిల్లాలో కలెక్టర్ చొరవ తీసుకోని అధిక ధరలకు పత్తి విత్తనాలను అమ్ముతున్న దుకాణాలపై చర్యలు తీసుకోవాలని దుకాణదారుల లైసెన్స్ రద్దు చేయాలని రైతులు విత్తనాలు కొనేటప్పుడు రసీదు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కొండు బానేష్,
మంచిర్యాల జిల్లా,
కార్యదర్శి ,
ఇందారపు రాజేష్
జిల్లా కార్యవర్గ సభ్యులు,
అల్లాల రామస్వామి,
కె.సాయి కుమార్,
పాల్గొన్నారు.