నడి కూడ,నేటి ధాత్రి:
ఈరోజు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు హన్మకొండ పర్యటనలో భాగంగా హన్మకొండ జిల్లా శాయంపేట సర్కిల్ వద్ద రజక కమ్యూనిటీ హాల్ కేసీఆర్ భవనం ప్రారంభోత్సవానికి విచ్చేసిన కల్వకుంట్ల తారక రామారావు ని మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రజకుల ఆత్మ గౌరవ భవనానికి మేడిపల్లిలో కేటాయించిన మూడు ఎకరాల స్థలాన్ని ఉప్పల్ భగాయత్ కి మార్పు చేయుటకు వీరనారి చాకలి ఐలమ్మ ట్రస్ట్ కోసం వినతి పత్రం అందజేయడం జరిగింది.
మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య సానుకూలంగా స్పందించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రజక సంఘాల సమితి కో కన్వీనర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు బిఆర్ఎస్ పార్టీ నడికూడ మండల అధ్యక్షులు ధురిశేట్టి చంద్రమౌళి (చందు) డాక్టర్ మధు చందూర్ సిరిసిల్ల రజక సంఘం జిల్లా అధ్యక్షులు దుబ్బాక రమేష్, రజక సంఘం నాయకులు కొన్నే సంపత్, పెద్దాపురం కుమారస్వామి డాక్టర్ గంగాధర్, గుడికందుల శివ, కొంరాజు ప్రశాంత్ రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.
మంత్రి కేటీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేసిన రజక సంఘం నాయకులు
