ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలం పోత్కపల్లి గ్రామ పద్మ శాలి సంఘం సభ్యులంతా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణా రావు ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువా తో సన్మానించారు.పద్మశాలి సంఘం కమ్యూనిటీ హాల్ కోసం వినతి పత్రం అందజేశారు.సానుకూలంగా స్పందించిన
ఎమ్మెల్యే త్వరలోనే పనులు మంజూరు చేస్తా మని చెప్పడంతో పద్మశాలి సంఘం నాయకులు,సభ్యులు ప్రత్యెక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి అధ్యక్షుడు దబ్బేట మల్లేశం, గుండ్లపల్లి రాజేందర్, అడేపు శ్రీనివాస్, వేముల శేఖర్,మామిడల రవీందర్, ఆడేపు నరేందర్,గుడ్ల సదానందం మరియు పీ ఏ సి ఎస్ ఛైర్మెన్ ఆళ్ళ సుమన్ రెడ్డి,మాజీ ఉప సర్పంచ్ వంగ శ్రీనివాస్ యాదవ్, సిరిసేటి రాహుల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.