వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గుంటూరుపల్లె గ్రామంలో భూకబ్జా ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. స్థానిక రైతు బుర్రి నరసింహారావు భూమిని కబ్జా చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగి రాంపాక రాంబాబు (ఆర్/బీ, డీఈ) మరియు ఆయన సోదరుడు రాంపాక నగేష్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
చెన్నారావుపేట ఎస్సై రాజేష్ రెడ్డి సహకారంతో భౌతిక దాడులు, బెదిరింపులు, హత్యాయత్నం జరిగిందని బాధితుడు తెలిపారు. తన భూమికి సంబంధించిన పాస్‌బుక్, రెవెన్యూ రికార్డులు ఉన్నప్పటికీ దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు.
సివిల్ కేసులో జోక్యం చేసుకుని అధికార దుర్వినియోగం జరుగుతోందని, ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, పైగా తనపైనే ఉల్టా కేసులు పెట్టి జైలుకు పంపించారని వాపోయారు.
తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ ఉన్నతాధికారులు సీపీ, డీసీపీలు విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
