జడ్పీ చైర్మన్ కి కృతజ్ఞతలు తెలిపిన లక్కారం రైతులు
ముత్తారం :- నేటి ధాత్రి
జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు ముత్తారం మండలం లక్కారం శుక్రవారం పేట చింతల చెరువు రిజర్వాయర్ లో నీరు లేనందున రైతుల కోరిక మేరకు గుండారం రిజర్వాయర్ నుండి నీటినీ విడుదల చేయడం జరిగింది. జడ్పీ చైర్మన్ పుట్ట మధు కి లక్కారం రైతులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ,రైతు బంధు సమితి మండల అధ్యక్షులు అత్తే చంద్రమౌళి, వార్డు సభ్యులు కురకుల సంపత్ ,రైతులు ఎస్ డి నభి,రషీద్,సారయ్య ,శంకర్ పాల్గొన్నారు